మార్కాపురం పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ప్రధాన కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయాయని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 20 రోజులకు ఒకసారి కూడా డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయకపోవడంతో అవి నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయని, శుభ్రం చేసేవారు కూడా లేరని వారు తెలిపారు. ఈ సమస్యతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.