జగన్ ప్రజలను దగా చేశారు

1చూసినవారు
ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను దగా చేశారని ఆరోపించారు. మంగళవారం రాత్రి వెలుగొండ ప్రాజెక్టును పరిశీలించి, పనుల పురోగతిని సమీక్షించారు. టన్నెల్ తవ్వే మిషన్ సొరంగంలో చిక్కుకుపోయినా, దాన్ని బయటకు తీసేందుకు ఎటువంటి ప్రయత్నం జరగలేదని ఆయన విమర్శించారు. హైకోర్టు స్టే విధించినా, కూటమి ప్రభుత్వం ఆ స్టేను ఎత్తేయించి, మిషనరీని బయటకు తీసేందుకు కృషి చేస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్