ప్రకాశం జిల్లా మార్కాపురంలో సోమవారం జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి వైసిపి,
జనసేన నేతలు ఒకే వేదికపై కనిపించడం ఆసక్తికరంగా మారింది.
జనసేన నేత బాలినేని శ్రీనివాస రెడ్డి, మార్కాపురం
జనసేన ఇన్ ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, వైసిపి నేత మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే సోదరుడు కందుల రామిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు ఒకే చోట చేరడం ఈ ప్రాంతంలో అరుదైన సంఘటనగా నిలిచింది.