మార్కాపురంలోని కొత్త వన్ స్టాప్ సెంటర్లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు జిల్లా శిశు అభివృద్ధి సాధికారత అధికారిణి పద్మావతి ఆదివారం తెలిపారు. అర్హత గల మహిళా అభ్యర్థులు మార్చి 11 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు జిల్లా వెబ్సైట్ నుంచి దరఖాస్తులు తీసుకుని, సర్టిఫికెట్లు జతచేసి జిల్లా కార్యాలయంలో అందజేయాలని ఆమె ఆదేశించారు.