మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో డీజిల్ కొరత తీవ్రమైంది. కొన్ని బంకుల్లో స్టాక్ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు ఏర్పడుతున్నాయి. ఇంధనం కోసం డబ్బాలను సైతం వెంట తెచ్చుకొని వాహనదారులు నిరీక్షిస్తున్నారు, దీంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.