మార్కాపురం యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచే కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయిలో చేపట్టినట్లు తెలిపారు. జిల్లా, మండల స్థాయిల్లో చర్చించి, గ్రామాల వారీగా తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన సూచించారు. 'ప్రభుత్వ బడిలోనే పిల్లలను చేర్పిద్దాం' అనే నినాదంతో ఈ కార్యాచరణ చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.