మార్కాపురానికి చెందిన పలువురు ఆదివారం విజయవాడలో హైందవ శంఖారావం సభకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రయివేటు స్కూలు బస్సు 40 మందితో శంఖారావం సభకు వెళ్లి తిరిగి వస్తుండగా పల్నాడు జిల్లా కోటప్పకొండ వద్ద ప్రమాదవశాత్తు బస్సు స్టీరింగ్ విరిగి బోల్తా పడింది. దింతో మార్కాపురం, తర్లుపాడు ప్రాంతాలకు చెందిన పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.