మార్కాపురం: వైన్ షాప్ తొలగించాలని విద్యార్థుల ధర్నా

1చూసినవారు
మార్కాపురం: వైన్ షాప్ తొలగించాలని విద్యార్థుల ధర్నా
మార్కాపురం పట్టణంలోని మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న వైన్ షాపును తొలగించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం వైన్ షాప్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పిడిఎస్యూ జిల్లా అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ, అధికారులు తక్షణమే స్పందించి వైన్ షాప్ను తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలో మహిళలు, వ్యాపారస్థులు, ప్రజలు కూడా వైన్ షాపును తొలగించాలని జేసీ శ్రీనివాసులు దృష్టికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్