మార్కాపురం జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాసిన 14,587 మంది విద్యార్థులలో 13,288 మంది ఉత్తీర్ణులయ్యారని జిల్లా ఇన్ఛార్జి విద్యాశాఖ అధికారిణి రేణుక తెలిపారు. 21 మండలాలలో పిసిపల్లి 99.35% ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో, ఎర్రగొండపాలెం 72.14%తో చివరి స్థానంలో నిలిచాయి. పిసిపల్లి మండలం గుంటుపల్లి హైస్కూల్ విద్యార్థి పవన్ సాయి 594 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానం సాధించారు.