ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైసిపి నాయకుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అకస్మాత్తుగా అనారోగ్యం పాలైన కాటమయ్యను ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన మృతిచెందగా శుక్రవారం కుటుంబ సభ్యులు అంతక్రియలు పూర్తి చేశారు. కాటమయ్య సతీమణి ఎల్లమ్మ ప్రస్తుతం మార్కాపురం 14వ వార్డు కౌన్సిలర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైసిపి నాయకుడు మృతికి పలువురు నివాళులు అర్పించారు.