మేంథా తుఫాను కారణంగా మార్కాపురం నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసి, పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో, గురువారం మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తన నివాసంలో వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దెబ్బతిన్న ప్రతి ఎకరాకు నష్టపరిహారం చెల్లించాలని, ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కాపురం, దర్శి ఏడిఏలు, వివిధ మండలాల ఏవోలు, హార్టికల్చర్ ఆఫీసర్, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.