ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో బుధవారం ఎమ్మెల్యే నారాయణరెడ్డి సతీమణి వసంత లక్ష్మి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్న తీరును కూడా ఆమె ఆరా తీశారు. అనంతరం, ఆమె విద్యార్థులకు రాగి జావను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.