మార్కాపురం మండలంలోని విశ్వబ్రాహ్మణ కాలనీలో అధ్వానంగా మారిన రోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం స్థానికంగా నివసిస్తున్న ఓ వ్యక్తి రోడ్డు ఇబ్బందులపై వీడియో విడుదల చేశాడు. టిడ్కో ఇల్లా నిర్మాణం సందర్భంగా నీటి పైపు నిర్మాణం కోసం రోడ్డు తవ్వి వదిలేయడం వల్ల ఈ ప్రాంతంలో ప్రయాణించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు వెంటనే స్పందించి తమ సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.