పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని సోషల్ మీడియాలో వార్తలు వ్యాప్తి చెందడంతో, మార్కాపురం పట్టణ పరిసర ప్రాంతాలలో పెట్రోల్ బంక్ యాజమాన్యాలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. దీనితో వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆదివారం ఉదయం నుంచే పెట్రోల్ కోసం బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే పెట్రోల్ బంకుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.