మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజల సమస్యలపై మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులతో ప్రత్యేక సమావేశం జరిగింది. వై. పాలెం ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, ప్రజలు తమ పునరావాసం, పరిహారం, మౌలిక సదుపాయాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలను పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.