మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో జనవరి 2వ తేదీ శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మరమ్మత్తుల కారణంగా చింతలపల్లి పీడర్ పరిధిలోని వర్ధనపల్లి, గోహారపల్లి, కొత్తపల్లి, కూరాకువారిపల్లి, చింతలపల్లి, హనుమంతురాయనిపల్లి, ఓబులాపురం గ్రామాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.