సంగమేశ్వరం డ్యామ్.. రూ. 166. 40 కోట్లు విడుదల

5చూసినవారు
సంగమేశ్వరం డ్యామ్.. రూ. 166. 40 కోట్లు విడుదల
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెన్నుపాడు సమీపంలో సంగమేశ్వర డ్యాం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 166.40 కోట్లు విడుదల చేయడానికి అనుమతులు మంజూరు చేసిందని మంత్రి స్వామి శనివారం తెలిపారు. ఈ రిజర్వాయర్ ద్వారా కొండపి నియోజకవర్గంలో 9500 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు 60 గ్రామాలకు తాగునీరు అందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో దీనికోసం రూ. 25 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్