మార్కాపురం పట్టణంలోని లాడ్జిలలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఆదివారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. కొత్త వ్యక్తులను ప్రశ్నించడంతో పాటు అనుమానిత వ్యక్తుల వివరాలను సేకరించారు. గదులు అద్దెకు ఇచ్చే సమయంలో నిర్వాహకులు పూర్తి వివరాలు సేకరించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.