స్థానిక జవహర్‌నగర్ కాలనీలోని పార్టీ ఆఫీసులో మాజీ సైనికుల హౌసింగ్ బోర్డు సొసైటీ సభ్యులు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని కలిసి, తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. సొసైటీ ఏర్పాటు గురించి వివరించిన వారికి, ఎమ్మెల్యే కందుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు సొసైటీ అధ్యక్షుడు చిన్నయ్య, కార్యదర్శి వెంకటనారాయణరెడ్డి, జైజవాన్ అసోసియేషన్ అధ్యక్షులు హరినారాయణరెడ్డి, కార్యదర్శి శేషసాయి పాల్గొన్నారు.