ప్రకాశం జిల్లా మార్కాపురం డిఎస్పి నాగరాజు రికవరీ ఏజెంట్లను హెచ్చరించారు. ప్రజలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మార్కాపురం డివిజన్ పరిధిలోని 12 పోలీస్ స్టేషన్లలో 100 మందికి పైగా రికవరీ ఏజెంట్లకు, వేలిముద్రల ఆధారంగా నగదు బదిలీ చేసే వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. చాలామందికి నిబంధనలు తెలియవని, ఆర్బిఐ నిర్దేశించిన విధంగానే రికవరీ చేయాలని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.