ప్రమాదంలో గాయపడ్డ ఉపాధ్యాయుడు మృతి

13చూసినవారు
ప్రమాదంలో గాయపడ్డ ఉపాధ్యాయుడు మృతి
ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సురేష్ బాబు, కొత్తపట్నం మండలం ఈతముక్కల పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. నెల రోజుల క్రితం గుంటూరులో తన కుమార్తెను చూసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్