తర్లుపాడు మండలం కలజువ్వలపాడులోని జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయంలో మంగళవారం జిల్లా తహసీల్దార్లు, ఎంపీడీవో, మున్సిపల్, ఏఎస్ వోలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అదనపు డైరెక్టర్ ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ జనాభా లెక్కల సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు తమకు కేటాయించిన విధులను సమగ్రంగా నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. జనాభా లెక్కల సేకరణ డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు ఆయన వివరించారు.