మార్కాపురం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ బంకులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఒక ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఈ చర్యలు కొనసాగుతాయని తెలిపారు.