మార్కాపురం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఎక్కడైనా ఇంధన కొరత లేదా సరఫరా లోపాలు తలెత్తితే వెంటనే స్పందించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు ఇంధన కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే +91 70133 08642 నంబర్ను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.