మార్కాపురంలో నేలకొరిగిన వృక్షాలు

3చూసినవారు
మార్కాపురం జిల్లా కేంద్రంలో మంగళవారం వీచిన గాలివాన తీవ్ర నష్టాన్ని కలిగించింది. బలమైన గాలుల కారణంగా అనేక చోట్ల పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఏకలవ్య కాలనీలో రెండు విద్యుత్ స్తంభాలతో పాటు ఒక పెద్ద వేపచెట్టు కూడా విరిగిపడింది. అదృష్టవశాత్తు, ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడం, విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :