మార్కాపురం మండలంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులు, పిడుగుపాటు సంఘటనలతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. బోడపాడు గ్రామ పొలాల్లో పిడుగుపాటుకు ఒంటేరు పోలమ్మ మృతి చెందగా, కోళ్ల ఫారం షెడ్డు కూలి చింతకుంట్ల కుమారి మృతి చెందింది. మరో మహిళకు గాయాలయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.