ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త చావుకు కారణమైంది ఓ భార్య. మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుక దంపతులకు 2018లో పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉండగా హైదరాబాద్ లోని బాచుపల్లిలో స్థిరపడ్డారు. భర్తకు తెలియకుండా ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకొని రమణారెడ్డి అనే వ్యక్తితో కలిసినప్పుడు ప్రైవేట్ వీడియోలు తీసుకోవడంతో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అది చుసిన భర్త ఫిబ్రవరిలో 19 పేజీల సూసైడ్ లేఖ రాసి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ లేఖ ఆధారంగా భార్యతో పాటు ఇద్దరు లవర్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య నమ్మకద్రోహం వల్లే నెలకు రూ. 2 లక్షలు సంపాదించే సీతారాం ప్రాణాలు కోల్పోయాడని, పిల్లలు అనాథలయ్యారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.