మార్కాపురం జిల్లా కేంద్రంలో వీచిన బలమైన గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఏకలవ్య కాలనీలో రెండు విద్యుత్ స్తంభాలతో పాటు పెద్ద వేపచెట్టు విరిగిపడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం, విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.