మార్కాపురం జిల్లాలో జూన్ 7 నుంచి 21 వరకు జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ విజయ సునీత ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో, ఆయుష్, విద్యా శాఖలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సాంస్కృతిక కార్యక్రమాలు, సోషల్ మీడియా ద్వారా యోగా ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆమె సూచించారు.