Mar 20, 2026, 09:03 IST/
బీఆర్ఎస్ లాగా చేసి ఉంటే బడ్జెట్ రూ.3,30 కోట్లు దాటేది: భట్టి
Mar 20, 2026, 09:03 IST
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఎలాంటి వివక్ష లేకుండా బీమా సౌకర్యం కల్పించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
ఉద్యోగులందరికీ కోటి రూపాయల బీమా అందిస్తున్నామని, ప్రజలే కేంద్రంగా బడ్జెట్ ప్రవేశపెట్టామని వెల్లడించారు. ఇది వాస్తవిక బడ్జెట్ అని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ మాదిరిగా కాకుండా వాస్తవ అంచనాలతో రూ.3,24,234 కోట్లతో బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ మాదిరిగా చేసి ఉంటే బడ్జెట్ మూడు లక్షల 30 వేల కోట్ల వరకు వెళ్లేదని సెటైర్ వేశారు.