
జిల్లావ్యాప్తంగా వాహన తనిఖీలు
ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో, ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మంగళవారం పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడంతోపాటు, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు.





































