ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం గుండాయపాలెం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 20 మందిని స్థానిక టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 17,350 నగదు, 13 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీఐ భీమా నాయక్ తెలిపారు. పేకాట ఆడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.