ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు 57 ఫిర్యాదులు

5చూసినవారు
ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు 57 ఫిర్యాదులు
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు మొత్తం 57 అర్జీలు అందాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎస్పీకి సమర్పించారు. అందజేసిన అర్జీలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి, తగు పరిష్కార చర్యలు చేపడతామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం లభించింది.

ట్యాగ్స్ :