ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాజాబాబు సోమవారం 'మీకోసం' కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ప్రజల సమస్యల పరిష్కారం కొరకే ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని కలెక్టర్ రాజాబాబు తెలిపారు.