ఒంగోలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అధికారుల రాకను పసిగట్టిన సిబ్బంది, లంచం తీసుకున్న నగదును కిటికీలో నుంచి బయటికి విసిరేసినట్లు సమాచారం. బయటికి వచ్చిన నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.