ఒంగోలులో బుధవారం తెల్లవారుజామున జరిగిన సంఘటనలో, ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనదారుడు పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని పరిశీలించగా, వైజాగ్ నుంచి చెన్నైకి తరలిస్తున్న ఐదు క్వింటాల గంజాయిని తౌడు బస్తాల మధ్య దాచి ఉంచినట్లు గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా, లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. డీఎస్పీ శ్రీనివాసరావు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.