ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బక్రీద్ పండుగ సందర్భంగా మూగజీవాల అక్రమ రవాణాపై ప్రజలను హెచ్చరించారు. మంగళవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, మూగజీవాలను తరలించి సంహరించడం చట్టరీత్యా నేరమని, ముఖ్యంగా గోవులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.