నకిలీ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

2చూసినవారు
నకిలీ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
పీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. ఆర్థిక సహాయం అందిస్తామని నకిలీ లింకులు పంపి, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత వివరాలు ఎవరికీ ఇవ్వవద్దని హెచ్చరించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే '1930' హెల్ప్ లైన్ నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్