ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరుకుపాలెం చెరువులో ఈతకు వెళ్లి గల్లంతైన నలుగురు చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. గురువారం మధ్యాహ్నం సుశాంత్, చిన్ను, దినేష్, అభిరామ్ అనే చిన్నారులు చెరువులో ఈతకు వెళ్లగా, గట్టుపై వారి బట్టలు కనిపించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.