తెలంగాణలో ప్రకాశం జిల్లా వాసిపై కేసు నమోదు

3చూసినవారు
తెలంగాణలో ప్రకాశం జిల్లా వాసిపై కేసు నమోదు
హైదరాబాద్ తెలంగాణ సచివాలయం వద్ద పోలీస్ యూనిఫాంలో ఒక వ్యక్తి రీల్స్ చేయడం కలకలం రేపింది. సీఎం రేవంత్ రెడ్డిని కలవాలంటే తనను కలవాలని ఆ వీడియోలో పేర్కొన్నాడు. పోలీసులు నిందితుడి కోసం గాలించి, అతడిని ఒంగోలుకు చెందిన రవిగా గుర్తించారు. వంటమనిషిగా పనిచేస్తున్న రవికి రీల్స్ చేసే అలవాటు ఉందని, ఈ క్రమంలోనే ఈ వీడియో చేశాడని పోలీసులు తెలిపారు. అతనిపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్