బీసీల కుల గణన పారదర్శకంగా నిర్వహించాలి

13చూసినవారు
బీసీల కుల గణన పారదర్శకంగా నిర్వహించాలి
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడి శ్వేత, డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. బీసీల కుల గణనను శాస్త్రీయంగా, అవకతవకలు లేకుండా నిర్వహించాలని ఆమె కోరారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, బీసీ మహిళలకు సబ్కోటా, రక్షణ చట్టం, 50 ఏళ్లకే పెన్షన్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్