ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో సోమవారం కేంద్ర బృందం పర్యటించింది. ఇటీవల తుఫాన్ కారణంగా మునిగిపోయిన వరి పంట పొలాలను బృందం పరిశీలించింది. వందల ఎకరాలలో పంట నష్టాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి రైతులకు నష్ట పరిహారం అందేలా చూస్తామని బృందం హామీ ఇచ్చింది.