ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు శనివారం ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ను స్వయంగా తనిఖీ చేశారు. బస్టాండ్ లో పార్కింగ్, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వారం రోజుల్లో బస్టాండ్ అభివృద్ధిపై సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.