ప్రకాశం కలెక్టరేట్లో ప్రమాదకరంగా సీలింగ్.!
ఒంగోలు కలెక్టరేట్లో సీలింగ్ ప్లాస్టర్ ఊడిపడడంతో భయాందోళన నెలకొంది. చాంబర్లో పైభాగం నుంచి సిమెంట్ పొరలు కూలిపోవడంతో సిబ్బంది, ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. కొన్నిచోట్ల సీలింగ్ దెబ్బతిని ప్రమాదకరంగా మారడంతో, నిత్యం వచ్చే ప్రజలు, ఉద్యోగులు పైకి చూస్తూ పనులు చేసుకుంటున్నారు. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని టెన్షన్గా ఉందని, అధికారులు వెంటనే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
