డ్రైనేజీ కాలవలో మృతదేహం కలకలం

7చూసినవారు
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ప్రగతి కాలనీ కాలువలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్