ప్రకాశం జిల్లా ఒంగోలులో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం పగలు చంద్రబాబుతో, రాత్రి జగన్మోహన్రెడ్డితో టచ్లో ఉంటూ బయటికి డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు. ప్రపంచంలో శ్రమ దోపిడీ ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.