ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులను సన్మానించి, వారి ప్రతిభను కలెక్టర్ రాజాబాబు కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ భిన్న ప్రతిభావంతులను గుర్తించి, వారి సేవలకు, ప్రతిభకు పెద్ద పీట వేసే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు చేపట్టారని కలెక్టర్ రాజాబాబు తెలిపారు.