లారీలో చిక్కుకున్న డ్రైవర్

16చూసినవారు
ప్రకాశం జిల్లా ఒంగోలు బైపాస్ లోని కొత్త కల్వరి టెంపుల్ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న కంటైనర్ లారీ డ్రైవర్ నిద్రమత్తులో ముందున్న లారీని బలంగా ఢీకొట్టడంతో, కంటైనర్ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. పోలీసులు, హైవే సిబ్బంది వెంటనే స్పందించి డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీసి, హైవే అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్