ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న సుమారు 50 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. జీజీహెచ్ అవుట్ పోస్ట్ ఏఎస్సై రవికుమార్ అందించిన సమాచారం మేరకు, ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మృతుని బంధువులు లేదా ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.