ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు భారీగా నష్టపోతున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి మంగళవారం సుందరయ్య భవన్‌లో అన్నారు. పొగాకు బోర్డు ఎస్టీసీ ద్వారా పొగాకు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఒక్కో బ్యార్నీకి రూ. 3 లక్షల వరకు నష్టం వస్తున్న పరిస్థితిలో, ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసాలు ఈ నష్టాన్ని ఎలా పూడ్చుతాయని ఆమె ప్రశ్నించారు.